IND VS SA 2020 : Shikhar Dhawan, Hardik Pandya and Bhuvneshwar Kumar return as India announce 15-member squad for 3-match ODI series against South Africa. #indvssa2020 #ViratKohli #rohitsharma #ShikharDhawan #KLRahul #PrithviShaw #RishabhPant #HardikPandya #RavindraJadeja #JaspritBumrah #cricket #teamindia న్యూజిలాండ్ గడ్డపై ఘోరంగా విఫలమైన భారత పురుషుల జట్టు.. స్వదేశంలో మరో రసవత్తరపోరుకు సిద్ధమైంది. మార్చి 12 నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. సునీల్ జోషీ నేతృత్వంలోని నూతన సెలెక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. వర్క్‌లోడ్ కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇస్తారని ప్రచారం జరిగినా.. బోర్డు మాత్రం అతన్నే కొనసాగించింది. ఇక గాయాలతో జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఓపెనర్ శిఖర్ ధావన్, బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు