After leading the Punjab Kings (PBKS) franchise for several seasons, KL Rahul will now reportedly spearhead the new Lucknow franchise in the 15th season of the Indian Premier League (IPL).#IPL2022MegaAuction#IPL2022#KLRahul#Lucknowfranchise#IPL2022schedule#PunjabKings#SuryakumarYadav#MumbaiIndians#Cricketటీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్.. పంజాబ్ కింగ్స్‌తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. లీగ్‌లోకి కొత్తగా రెండు జట్లు రావడంతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌ను వీడేందుకు సిద్దమైన కేఎల్ రాహుల్.. సంజీవ్ గోయెంకాకు చెందిన లక్నో ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే సీజన్లో లక్నో టీమ్‌ను రాహులే నడిపించనున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను అటు సంజీవ్ గోయెంకా గ్రూప్, ఇటు రాహుల్ సన్నిహిత వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.