WTC Final: The ICC is promoting the inaugural World Test Championship final as the 'Ultimate Test', but India captain Virat Kohli has said that the result of the one-off match against New Zealand cannot decide which is the "best" team in the format#WTCFinalDay1#ViratKohli#IndianFans#RohitSharma#RavindraJadeja#INDvNZ #TeamIndiaPlayingXI#WTC21#KaneWilliamson#IndiavsNewZealand #RishabhPant#ShubmanGillప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో తాము ఓడిపోయినంత మాత్రాన ప్రపంచమేం ఆగిపోదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కేవలం ఈ ఐదు రోజుల్లోని ఆటతో వచ్చే ఫలితంతో తమ సత్తా డిసైడ్ కాదన్నాడు. న్యూజిలాండ్తో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ తమకు మరో సాధారణ మ్యాచ్ అని చెప్పాడు. గత నాలుగైదేళ్లలో తమ ఆటను అర్థం చేసుకున్న వారెవరైనా ఇలాగే ఆలోచిస్తారని వెల్లడించాడు. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లకు తమకు మంచి స్నేహితులని, కానీ అది మైదానం బయటవరకేనని స్పష్టం చేశాడు.