Kyle Jamieson on Virat Kohli’s dismissal on Day 2#ViratKohli#KYLEJamieson#Worldtestchampionship#WTCFinal#IndvsNz#KaneWilliamsonపరుగుల మెషిన్, టీమిండియా సారథి విరాట్ కోహ్లీని పెవిలియన్ పంపిన బంతికి ఎవరైనా ఔటవుతారని న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ అన్నాడు. ఎంతటి గొప్ప బ్యాట్స్‌మన్ అయినా సరే వరుసగా ఔట్ స్వింగర్లు ఎదుర్కొని.. ఒక్కసారిగా ఇన్‌స్వింగర్ ఆడటం కష్టమేనన్నాడు. భారత్‌తో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో జెమీసన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ మరియు జస్ప్రీత్ బుమ్రాలను అతడు పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా కోహ్లీకి వేసిన బంతి అద్భుతం అని చెప్పొచ్చు.