Bombay High Court rules in favour of BCCI, sets aside arbitrators' order of paying Deccan Chargers 4800 crores#Bcci#Ipl#Deccanchargers#SouravGangulyఒకప్పటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజ్ డెక్కన్ ఛార్జర్స్ (డీసీ) యాజమాన్యం వేసిన కేసులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) యాజమాన్యంకు రూ.4,800 కోట్లు చెల్లించాలంటూ గతంలో బీసీసీఐకి ఆర్బిటర్ ఇచ్చిన ఆదేశాలను (మధ్యవర్తిత్వ ఉత్తర్వులను) బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ జీఎస్ పటేల్‌తో కూడిన బెంచ్ తాజా ఆదేశాలను జారీ చేసింది. కోర్టు తీర్పు సంతోషకరంగా ఉందని, తాము అన్నీ అగ్రిమెంట్ ప్రకారమే చేశామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.