IPL 2020: ‘We are keeping a tab’ - Sourav Ganguly, Brijesh Patel react to coronavirus effect.#ipl2020#IndianPremierLeague#SouravGanguly#BrijeshPatel#IPL#indiavssouthafrica#indvssa#viratkohli#msdhoni#mumbaiindians#chennaisuperkings#cskvsmi#iplscheduleగత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ (కొవిడ్-19) ముప్పు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు ఏ మాత్రం ఉండదని గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ స్పష్టం చేశారు. దేశంలో రెండు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై అనుమానాలు రేకెత్తాయి. మార్చి 29న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. మ్యాచ్‌లు చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు మైదానాలకు వచ్చే అవకాశం ఉండటంతో కరోనా వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉందని..ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించడం కష్టమేననే ఉహాగానాలు వినిపించాయి.