SRH vs RCB Live: SRH’s biggest fan Venkatesh Daggubati sends his wishes to team#SunRisersHyderabad#SRHvsRCB#RCB#Royalchallengersbangalore#Ipl2020#VenkateshDaggubati#DavidWarner#ViratKohliకరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 యూఏఈలో జరుగుతున్న విషయం తెలిసిందే. ముగిసింది రెండు మ్యాచ్‌లే అయినా.. క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించాయి. బ్యాట్స్‌మన్, బౌలర్ల పోరాటాలను నేరుగా మైదానాల్లోకి వెళ్లి చూడకున్నా.. టీవీల్లోనే చూస్తూ సొంత జట్ల అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2020లో భాగంగా ఈరోజు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎదురుచూస్తున్నారు.