World Cup 2019: Rohit Sharma smashed few records on his way to 23rd Century. India vs South Africa #CWC19 #iccworldcup2019 #indvsa #indiavssouthafrica2019 #msdhoni #rohitsharma #viratkohli #fafduplessis #kagisorabada హైదరాబాద్: ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఆడిన ఏ సిరిస్లోనూ పెద్దగా రాణించలేదు. ఐపీఎల్ 12వ సీజన్లో సైతం రోహిత్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్లో ఏమాత్రం రాణిస్తాడో అన్న సందేహాలు నెలకొన్నాయి.అయితే, బుధవారం సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్లో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అనంతరం చేధనలో 144 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 122 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.