ICC T20 World cup 2021: Indian opener KL Rahul is expected to lead the Men in Blue in the upcoming T20I series against New Zealand with several senior players opting for rest following a hectic schedule.#ICCT20Worldcup2021#INDVSNZT20Series#KLRahulT20Captain#IPL#INDVSAFG#IPL2022megaauction#Viratkohliటీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ వంటి పలువురు సీనియర్లు ఈ సిరీస్‌కు దూరంగా ఉంటారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి ప్రముఖ వార్త సంస్థ ఏఎన్ఐకి తెలిపారు. దాంతో టీమ్‌ను కేఎల్ రాహుల్ నడిపిస్తాడని చెప్పాడు. ఇక ఈ సిరీస్ ప్రేక్షకుల మధ్యే జరుగుతుందని, పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని చెప్పాడు. ఇప్పటికే ఆ దిశగా కార్యచరణ మొదలు పెట్టామని, స్థానిక అధికారులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించాడు.