IPL 2021 Final, CSK Vs KKR: CSK's MS Dhoni becomes first captain to lead in 300 T20s#IPL2021Final#CSKVSKKR#IPL2021Trophy#MSDhoni300T20sAsCaptain #MSDhoni#IPL2021Titlewinner#ChennaiSuperKings#KolkataKnightRidersఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వికెట్ డ్రైగా ఉండటంతో పాటు డ్యూ ప్రభావం ఉండనున్న నేపథ్యంలోనే ఫీల్డింగ్ ఎంచుకున్నానని కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నామని మోర్గాన్ స్పష్టం చేశాడు. దాంతో విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.ఇక తాము టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకున్నవాళ్లమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా విన్నింగ్ టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నామన్నాడు. దాంతో కీలక మ్యాచ్‌లో కూడా సురేశ్ రైనాకు చోటు దక్కలేదు. ఇక టీ20ల్లో కెప్టెన్‌గా ధోనీకిది 300వ మ్యాచ్ కావడం విశేషం.