IPL 2021: Check out UAE weather & pitch report in Sharjah, Dubai and Abu Dhabi#IPL2021#UAEpitchreport#Sharjah#Dubai #IPL2021inUAE#CSKVSMI#Spinnersఆదివారం (సెప్టెంబర్ 19) ఐపీఎల్ రెండో దశ మ్యాచులు ఆరంభం కానున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 2021 మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే రెండో దశకు ప్రేక్షకులను అనుమతించడంతో రెట్టింపు మజా ఖాయం. ఈ నేపథ్యంలో యూఏఈలోని స్టేడియాలు.. అందులోని పిచ్‌లపై చర్చ జోరుగా సాగుతోంది. ఓసారి యూఏఈ పిచ్‌ల విశేషాలను చూద్దాం. గతేడాది ఐపీఎల్ పూర్తిగా యూఏఈలోనే నిర్వహించిన సంగతి తెలిసిందే. అబుదాబి, షార్జా, దుబాయ్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పుడు కూడా ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లకు ఈ మూడు స్టేడియాల్లోనే జరుగనున్నాయి. దాంతో మ్యాచ్‌లు సాగేకొద్దీ పిచ్‌లు నెమ్మదించే ఆస్కారం ఉంది.