IPL 2021 : Gautam Gambhir Key Suggestions to punjab kings . Mi vs Punjab kings. #Ipl2021 #Gambhir #PunjabKings #Mumbaiindians #MivsPbks #KlRahul #Gayle ఐపీఎల్ 2020 సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్ మళ్లీ విజయాల బాటపట్టాలంటే యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌ను ఓపెనర్‌గా ఆడించాలని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన పంజాబ్ కింగ్స్.. ఆ తర్వాత చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ చేతిలో వరుసగా ఓటమిపాలైంది.దాంతో జట్టు కాంబినేషన్‌పై మాజీ క్రికటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. క్రిస్ గేల్‌కు బదులు టీ20 నంబర్ వన్ ప్లేయర్, ఇంగ్లండ్ హిట్టర్ డేవిమ్ మలాన్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ సలహాను గంభీర్ కొట్టిపారేశాడు.