Andhra pradesh state election commissioner nimmagadda ramesh kumar met governor harichandan today to discuss about gram panchayat eletions notifiation tomorrow.#NimmagaddaRameshKumar#BiswaBhusanHarichandan#PanchayatPolls#APCMJagan#APHighCourt#PanchayatElections#PanchayatElectionsNotification#StateElectionCommissionerఏపీలో పంచాయతీ ఎన్నికలను ఎట్టిపరిస్ధితుల్లోనూ నిర్వహించి తీరాలని పట్టుదలగా ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అందుకు అనుగుణంగా పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. ఓవైపు హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన నిమ్మగడ్డ ఇవాళ గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఉదయం 11 గంటల తర్వాత విజయవాడలోని రాజ్‌భవన్‌ను వచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌తో దాదాపు అరగంటసేపు భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు, అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలను ఆయన గవర్నర్ హరిచందన్‌కు వివరించారు. ముఖ్యంగా ఉద్యోగుల వ్యవహారశైలిపై నిమ్మగడ్డ మరోసారి గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.