Telangana : Hyderabad Corona Virus Update. #Hyderabad #Telangana #Cmkcr #Trs #Ghmc #Covid19 #Coronavirusindia #Coronavirus తెలంగాణలో గురువారం నాటి కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గురువారం మొత్తం 2381 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,81,627 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,387గా ఉన్నాయి. మరో 24,592 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 2,021 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక గురువారం మరో 10 మంది కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1080కి చేరింది.