Marnus Labuschagne, Australia's unlikely No. 3 on a day his legspin was blunted by India, Marnus Labuschagne hoped to emulate Cheteshwar Pujara's patience with the bat. #IndiavsAustralia4thTest #MayankAgarwal #Pujara #hanumavihari #MarnusLabuschagne #viratkohli ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో పూజారా విజృంభించాడు. ఓపెనర్ రాహుల్(9)కే తొలి వికెట్‌ను కోల్పోయిన టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలకడగానే ఆరంభించింది. ఈ క్రమంలో పరవాలేదనిపించుకునే స్కోరుతోనే టీమిండియా వికెట్లు చేజారినా... పూజారా ఎప్పటిలాగే క్రీజులో పాతుకుపోయాడు. ఇలా సెంచరీకి మించిన స్కోరుతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కొత్త స్పిన్నర్ మార్నస్ లాబుచాగ్నేకి భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా ఊహించని షాక్ ఇచ్చాడు. సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌తో ఆస్ట్రేలియా జట్టులోకి పునరాగమం చేసిన మార్నస్‌కి తొలి ఓవర్లోనే 0, 4, 0, 4, 0, 4తో పుజారా స్వాగతం పలికాడు. అప్పటి వరకూ 132 బంతుల్లో 4 ఫోర్లు మాత్రమే కొట్టిన పుజారా.. ఆ ఓవర్లో కేవలం 6 బంతుల వ్యవధిలోనే 3 ఫోర్లు కొట్టడం కొసమెరుపు. పుజారా (82 బ్యాటింగ్: 178 బంతుల్లో 10ఫోర్లు) జోరుతో భారత్ 65 ఓవర్లు ముగిసే సమయానికి 211/3తో మెరుగైన స్కోరు దిశగా దూసుకెళ్లింది.